కళ్యాణదుర్గం పట్టణంలోని బసవేశ్వర నగర్ కు చెందిన మాజీ సర్పంచ్ వసుంధరమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ రఘువీరారెడ్డి తన స్నేహితులతో కలిసి శుక్రవారం కళ్యాణదుర్గం వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వసుంధరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం ప్రకటించారు. రఘువీరరెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.