దుర్గం: కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ అంబేద్కర్ కు వినతి

68చూసినవారు
అంబేద్కర్ 134వ జయంతి వేడుకల సందర్భంగా సోమవారం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి సమస్యలపై కార్మికులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ తమకు జీతాలు, పీఎఫ్ ఇవ్వకుండా రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 9 రోజులుగా సమ్మె చేస్తున్నా సమస్యలను పరిష్కరించడం లేదని నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్