పుష్ప-2 సినిమా టికెట్ ధరలు అధికంగా విక్రయిస్తే చర్యలు చేపట్టాలని జై భీమ్ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కళ్యాణదుర్గం ఎమ్మార్వో భాస్కర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. జై భీమ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విలియమ్స్ మాట్లాడుతూ కళ్యాణదుర్గంలోని థియేటర్లలో సినిమా టికెట్లపై ధర, జీఎస్టీ నెంబర్లు లేవని, సరైన వసతులు లేకున్నా అధిక ధరకు విక్రయించే అవకాశం ఉందని తెలిపారు.