రాష్ట్రస్థాయి పాలీసెట్ ఫెస్ట్ లో కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచి రూ. 25 వేల నగదు బహుమతికి ఎంపికయ్యారు. మంగళవారం బోరంపల్లి పాలిటెక్నిక్ కళాశాల కళాశాలలో ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన సభలో విజేతలైన చరణ్ తేజ, మోహిత్ కుమార్ కు మెడల్స్, నగదు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.