కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ రెహనా మాట్లాడుతూ ప్రతిరోజు చెత్త మురికిని తొలగించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మున్సిపల్ కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 62 మంది మున్సిపల్ కార్మికులకు మధుమేహం, రక్తపోటు పరీక్షలు చేసి కార్మికులకు మందులు పంపిణీ చేశారు.