మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలి: అంగన్వాడీ యూనియన్

56చూసినవారు
మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలి: అంగన్వాడీ యూనియన్
కళ్యాణదుర్గం పట్టణంలో బుధవారం ఐద్వా, సీఐటీయూ, అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహణపై ఆందోళన చేపట్టారు. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా డివిజన్ కార్యదర్శి లత మాట్లాడుతూ మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే మద్యం విక్రయాలు విచ్చలవిడి అవుతాయన్నారు. దాంతో మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్