ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా హనుమంత రాయుడు ఎన్నిక

75చూసినవారు
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా హనుమంత రాయుడు ఎన్నిక
ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మర్రిమాకులపల్లికి చెందిన హనుమంతరాయుడును ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభల్లో శుక్రవారం ఎన్నుకున్నారు. ఏఐఎస్ఎఫ్ తాలూకా స్థాయి నాయకుడుగా విద్యార్థి సమస్యలపై దశాబ్ద కాలంగా అందించిన సేవలను గుర్తించి జిల్లా మహాసభల్లో తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు హనుమంతరాయుడు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థి సమస్యలపై రాజీలేని పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్