కళ్యాణ దుర్గం: రైతులకు సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు పంపిణీ

62చూసినవారు
కళ్యాణ దుర్గం: రైతులకు సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు పంపిణీ
పాలవెంకటాపురం గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందించిన వేరుశనగ విత్తనాలు టీడీపీ మండల నాయకులు పాలబండ్ల సురేంద్ర ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి మంగళవారం పంపిణీ చేశారు. సురేంద్ర మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులకు అధిక దిగుబడులు వచ్చే విధంగా నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు.

సంబంధిత పోస్ట్