జనవరి 31వ తేది వరకు కళ్యాణదుర్గం పట్టణంలోని కమ్మనుచెట్ల, న్యూఎస్పీ కాలనీ సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశామని మున్సిపల్ కమీషనర్ వంశీకృష్ణ భార్గవ్ శనివారం విలేఖరులతో తెలిపారు. ఆధార్ కార్డు లేని వారు, అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలు, పాఠశాల విద్యార్థులు, ఇతరులు ఆధార్ నమోదు, ఆధార్ మార్పులు, చేర్పులకు ఇది మంచి సదావకాశమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.