కళ్యాణదుర్గం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి వేలాది రూపాయల ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేదిస్తున్న విద్యా సంస్థలను సీజ్ చేయాలని జిల్లా అధ్యక్షుడు హనుమంతు డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళలు చేస్తామన్నారు. విద్యార్థులు అధిక ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.