కళ్యాణదుర్గం: టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఎం

54చూసినవారు
టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర నాయకులు రాంభూపాల్ డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి, గరుడాపురం గ్రామాల్లో టమాటా పంటను బుధవారం ఆయన పరిశీలించారు. రైతులు టమాటాకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తోటలోనే వదిలేయాల్సి వస్తోందని వాపోయారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రాంభూపాల్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్