కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న హరినాథ్ బాబుకు ఇటీవల ఏఎస్సైగా ప్రమోషన్ వచ్చింది. ఈ సందర్భంగా ఆయనను పట్టణ సీఐ యువరాజ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి బుధవారం ఘనంగా సన్మనించారు. హరినాథ్ ప్రమోషన్ లో భాగంగా సత్యసాయి జిల్లాకు బదిలీ అయ్యారు.