కళ్యాణదుర్గం పట్టణంలో న్యాయవాదుల నిరసన

69చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. సీనియర్ న్యాయవాది సంజీవప్ప మాట్లాడుతూ న్యాయవాది శేషాద్రి మరణానికి పోలీసులే కారణమని ఆరోపించారు. అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఒక సివిల్ తగాదా పరిష్కారంలో ఒత్తిడికి గురి చేసినందువల్లే శేషాద్రి మరణించారన్నారు. సంబంధిత పోలీసులను సస్పెండ్ చేసి శేషాద్రి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్