కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన పూల రాము అనే వ్యక్తి ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పూల రాము నసనకోట ముత్యాలమ్మ దేవాలయానికి బైక్ పై వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి కళ్యాణదుర్గం బయలుదేరాడు. అయితే మార్గ మధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.