కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో సమ్మె కాలం నాటి ఒప్పందాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.