కళ్యాణదుర్గం పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో శుక్రవారం కిషోర్ వికాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీవో వసంత బాబు, డీఎస్పీ రవిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు పోషకాహారం పక్కాగా అందించాలని అన్నారు. తల్లిపాలే చిన్నారులకు శ్రీరామరక్ష అని ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బందికి తెలిపారు.