కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో పోలీసులు ప్రజలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ వంశీకృష్ణ పర్యవేక్షణలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ చేపట్టారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సైబర్ మోసాలు, దొంగతనాలు జరుగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలో తీసుకోవాలో గ్రామస్థులకు వివరించారు. గ్రామాలలో ప్రజలు శాంతియుతంగా జీవించాలని ఆయన తెలిపారు.