సత్యసాయి నీటి పథకం మోటార్లు పని చేయకపోవడంతో ప్రజలు నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పీఏబీఆర్ నుంచి మూడు పైపులైన్ల ద్వారా కళ్యాణదుర్గం, అనంతపురం, ఆత్మకూరు పరిధిలోని 93 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. పీఏబీఆర్ ప్రాజెక్టులో మోటార్లు సక్రమంగా లేకపోవడంతో సరఫరా ఆగిపోయింది. ఎట్టకేలకు మోటార్లు మరమ్మతు చేసి సోమవారం రాత్రి నీటి సరఫరాను పునరుద్ధరించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.