కళ్యాణదుర్గం: ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టిన పోలీసులు

72చూసినవారు
కళ్యాణదుర్గం: ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టిన పోలీసులు
అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలతో శనివారం కళ్యాణదుర్గం పట్టణంలో పోలీసులు డ్రోన్లు ఎగురవేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, వివిధ కాలనీల్లోని వాహనాల రాకపోకలను సమీక్షించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రధాన దృష్టి సారించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా డ్రోన్లు ద్వారా పరిశీలించి తగు చర్యలు తీసుకున్నారు. పట్టణంలో పలు చోట్ల ఎప్పటికప్పుడు డ్రోన్ తో నిఘా వుంచినట్లు సిఐ యువరాజ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్