కుందుర్పి మండలం మలయనూరు గ్రామ శివార్లలో నేతి హారీష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఆదివారం కర్ణాటక మద్యం తరలిస్తుండగా మార్గమధ్యంలో కాపుకాచి 180మిల్లీలీటర్ల సామర్థ్యం కల్గిన 192టెట్రా ప్యాకెట్లతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అదేవిధంగా కంబదూరులో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న శివ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఇరువురిపై కేసు నమోదు చేశామన్నారు.