కుందుర్పి ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ రూ. 10లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రం మూతపడిందని మండల ప్రజలు శనివారం తెలిపారు. దీంతో స్థానికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నాలుగు వారాలుగా యంత్రం మరమ్మతులకు గురయ్యింది. ఇప్పటి వరకూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.