కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం రవాణా శాఖ, జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. జూనియర్ కళాశాల విద్యార్థులు అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, రోడ్డు భద్రత ఆవశ్యకతపై నినాదాలు చేశారు. ఆర్టీవో రమేష్ మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.