కళ్యాణదుర్గం మండలం గురువేపల్లిలో రైతు సన్నప్పకు చెందిన రెండు ఎద్దులు విషపూరిత పశుగ్రాసం తిని మంగళవారం మృత్యువాత పడ్డాయి. మొక్కజొన్న పంటకు క్రిమి సంహారక మందును పిచికారీ చేశారు. రెండు ఎద్దులు ఆ మొక్కజొన్న పంటను తినడంతో నోటి నుంచి నురుగు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాయి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.