కళ్యాణదుర్గం పట్టణంలోని కన్నెపల్లి రోడ్డులో ఆదివారం చిరుతపులి ప్రజలలో కలకలం రేపింది. చిరుత దాడిలో రెండు ఆవుదూడలు మృతి చెందాయి. దీంతో రైతుల పొలాలకు వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనుల నిమిత్తం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వెంటనే అధికారులు స్పందించి చిరుత దాడి నుండి తమ ప్రాణాలను రక్షించాలని కోరారు.