కళ్యాణదుర్గం: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

72చూసినవారు
కళ్యాణదుర్గం: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
కుందుర్పి మండలం జానంపల్లికి చెందిన రైతు కురబ గంగప్ప గ్రామ సమీపంలోని రాళ్లగుట్టలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ వెంకటేశులు తెలిపారు. అప్పులు ఎక్కువ కావడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. చెట్టుకు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం వేలాడుతుండటం చూసి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు గంగప్పగా భావించి కుటుంబసభ్యులకు తెలిపారు. సోమవారం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్