కళ్యాణదుర్గం: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

84చూసినవారు
కళ్యాణదుర్గం: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కుకు ఎమ్మెల్యే సురేంద్రబాబు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్