ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం పట్టణంలోని బిలాల్ మసీదులో మతపెద్దలతో కలిశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మసీదులో శౌచాలయం నిర్మించడంపై హర్షం వ్యక్తం చేశారు. మదరసా ఇరుగ్గా ఉందని, మరో చోట స్థలం కేటాయించాలని కోరారు. పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో నాడు నేడు పనులు ఆగిపోవడంతో ఇబ్బందులు పడు తున్నారని, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు.