కళ్యాణదుర్గం: 50శాతం వడ్డీ రాయితీ ఈ నెల 30 వరకు పెంపు

51చూసినవారు
కళ్యాణదుర్గం: 50శాతం వడ్డీ రాయితీ ఈ నెల 30 వరకు పెంపు
పన్నుల చెల్లింపుపై 5శాతం రాయితీని కల్పించడమే కాకుండా పన్నుల బకాయిదారులకు మరోసారి ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై 50శాతం వడ్డీ రాయితీతో చెల్లింపు గడువును ఈనెల 30వ తేది వరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని కళ్యాణదుర్గం ప్రజలు వినియోగించుకోవాలని శనివారం మున్సిపల్ కమిషనర్ వంశీ కృష్ణ భార్గవ్ తెలిపారు. పన్నులు ఏకమొత్తంలో చెల్లించి డబుల్ ధమాకా ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్