కళ్యాణదుర్గం: ఈ నెల 15న పట్టాభిరాముడికి జ్యేష్టాభిషేకం

52చూసినవారు
కళ్యాణదుర్గం: ఈ నెల 15న పట్టాభిరాముడికి జ్యేష్టాభిషేకం
కళ్యాణదుర్గం పట్టణంలోని కోటవీధిలో వెలిసిన శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఈ నెల 15వ తేదిన జ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు గురువారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి స్నపన తిరుమంజనం, 11:30 గంటలకు మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయాధ్యక్షులు దేవినేని అవినాష్ హాజరవుతారని చెప్పారు. శ్రీరాముడి సేవలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్