కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తహశీల్దార్లు, డివిజనల్ సర్వేయర్లు, సీఎస్టీడీ, ఆఫీస్ సిబ్బందితో ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వసంత్ బాబు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ల్యాండ్ అక్విసిషన్, సివిల్ సప్లైస్, రెవెన్యూ సదస్సులు, క్యాస్ట్ సర్వే పెండింగ్ తదితర విషయాల గురించి సమీక్ష నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు.