కళ్యాణదుర్గం: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

68చూసినవారు
కళ్యాణదుర్గం: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
కళ్యాణదుర్గం ఆర్డిఓ కార్యాలయంలో సోమవారం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పిజిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జీ. వసంతబాబు, డివిజనల్ స్థాయి అధికారులు మరియు కార్యాలయపు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ డివిజనల్ అధికారి వారు ప్రజా సమస్యలను త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా డివిజన్ స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్