కళ్యాణదుర్గం పట్టణంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వెంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించి రథసప్తమి వాహనంలో ఆలయ నిర్వహకులు, అర్చకులు ఊరేగింపు నిర్వహించారు. భక్తులు స్వామివారి అనుగ్రహం కోసం దర్శించుకున్నారు.