అహుడ ఛైర్మన్, జిల్లా జనసేన అధ్యక్షులు వరుణ్ జన్మదిన వేడుకలను కళ్యాణదుర్గంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అహుడ ఛైర్మన్ జన్మదినం సందర్భంగా జనసేన ఇన్ ఛార్జి బాల్యం రాజేష్, జనసేన జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని కోట వీధిలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం చేశారు.