కళ్యాణదుర్గం: వెంకటేశ్వరస్వామి ఆలయంలో భజనలు

69చూసినవారు
కళ్యాణదుర్గం: వెంకటేశ్వరస్వామి ఆలయంలో భజనలు
కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులోని శ్రీ గోదాదేవి పద్మావతి దేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా మంగళవారం ప్రత్యేక భజన కార్యక్రమం, ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని వివిధ పుష్పాలు, వెండి, పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రకాశ్ దంపతులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్