కళ్యాణదుర్గం: పశువుల గర్భకోశ చికిత్సా శిబిరం

79చూసినవారు
కళ్యాణదుర్గం: పశువుల గర్భకోశ చికిత్సా శిబిరం
కళ్యాణదుర్గం మండలం పాల వెంకటాపురం గ్రామంలో శుక్రవారం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువుల గర్భకోశ చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ పశువులకు పెయి దూడల కృత్రిమ గర్భధారణ చేయు పథకం గురించి వివరించారు. పెయి దూడల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. పాడి రైతులు పెయి దూడల కోసం కృత్రిమ గర్భధారణ చేయించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్