కళ్యాణదుర్గం: ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రకు సీపీఐ సంఘీభావం

69చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఎ రెన్యువల్ కోసం వైసీపీ నాయకులు తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సోమవారం లక్ష్మంపల్లిలో జరిగిన పాదయాత్రలో సీపీఐ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ ఆర్డీటీ పరిరక్షణ కోసం రంగయ్య చేస్తున్న పాదయాత్ర అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్