కళ్యాణదుర్గం మేజర్ పంచాయతీ సర్పంచ్ గా విధులు నిర్వహించిన వసుంధరమ్మ బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కళ్యాణదుర్గం మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు సర్పంచ్ గా అప్పుడు పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చేయడం, సీసీ రోడ్లు, వీధిలైట్లు వేయించి ప్రజలకు సేవలందించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు.