శెట్టూరు మండలంలో ఈ నెల 16వ తేది సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ లక్ష్మీదేవి, ఇన్ ఛార్జి ఎంపీడీఓ రఘురాంరావు శనివారం విలేఖరులకు తెలిపారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు, సర్పంచ్లు, సంబంధిత సిబ్బంది తప్పక హాజరు కావాలని వారు కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఈ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.