కళ్యాణదుర్గం పట్టణంలోని కోట వీధిలో వెలసిన శ్రీ పట్టాభి రామస్వామి రథోత్సవ ఏర్పాట్లు కనివిని ఎరగని రీతిలో ఏర్పాటు చేయడంతో నూతన శోభను సంతరించుకుంది. పట్టణ పురవీధులు విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రథోత్సవ ఏర్పాట్లకు పట్ల ఎమ్మెల్యే అమీలినేని సురేంద్రబాబు తోడ్పాటును అందించగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు దేవినేని అవినాష్ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టణ ప్రముఖుల సలహాలు సూచనలతో ఏర్పాట్లను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. గురువారం ప్రారంభమై 14వ తేదీ వరకు కొనసాగునున్నాయి.