కళ్యాణదుర్గం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన హోమియో కేంద్రాన్ని తరలిస్తున్నట్లు ఆయుష్ విభాగం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ రాజు బుధవారం తెలిపారు. 2008లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా వైద్యులు లేకపోవడం, అలాగే ఇతర సౌకర్యాలు లేకపోవడంతో కేంద్రాన్ని మరొక చోటుకు తరలిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలు గమనించాలని కోరారు.