కళ్యాణదుర్గం పట్టణంలోని టీడీపీ ప్రజా వేదిక కార్యాలయంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు. కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్య మించి, ప్రచారం చేయడమే కాక, బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారన్నారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు.