కళ్యాణదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మే 11, 12వ తేదీలలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.