కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, డీఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ జాబ్ మేళాకు 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న నిరుద్యోగులు నిర్దేశించిన సర్టిఫికెట్లతో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.