శెట్టూరు మండలం కనుకూరు గ్రామానికి చెందిన గురుమూర్తి అనారోగ్యంతో బాధపడుతూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కలిసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలిసిన ఎమ్మెల్యే అమిలినేని గురువారం ఆయనే స్వయంగా బాధితుడి వద్దకు చేరుకుని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే అనంతపురం సూపర్ స్పెషల్ అస్పత్రి వైద్యులతో మాట్లాడి చికిత్స అందించాలని సూచించారు.