కుందుర్పి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను శనివారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పరిశీలించారు. తరగతి గదులతో పాటు మరుగుదొడ్లను పరిశీలించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ గురుకుల పాఠశాలకు త్వరలోనే పక్కా భవనాన్ని నిర్మిస్తామన్నారు. విద్యార్థులకు తాగునీటిని అందించడానికి ఆర్వో ప్లాంటును త్వరలోనే ఏర్పాటు చేయిస్తామన్నారు.