కుందుర్పి మండల కేంద్రంలో వెలసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొనగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని, మడుగు తేరుకు పూజల చేసి భక్తులతో కలసి తేరును ముందుకు లాగారు. ఈ పూజల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.