అనంతపురం జిల్లా కేంద్రంలో జిఎంఆర్ గ్రౌండ్స్ ఇంద్రప్రస్థంలో శుక్రవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముద్దుల తనయ శ్రీచరిత, మిత్రుడు, వియ్యంకుడు ముత్తినేని రాజగోపాల్ కుమారుడు రాహుల్ ఆదిత్యల వివాహ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటగా దుర్గామాత పూజతో ప్రారంభమవగా ప్రముఖులు రావడంతో మరింత సందడి నెలకొంది. ప్రముఖుల్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హిందూపురం ఎంపీ బీకే పార్ధసారధి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు.