కళ్యాణదుర్గం: ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారుల ఇక్కట్లు

232చూసినవారు
కుందుర్పి మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండల ప్రజలు విలేఖరులకు తెలిపారు. మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు కూడలిలో ట్రాఫిక్ సమస్య అధికమైందన్నారు. బ్యాంక్ కు వచ్చే కస్టమర్ల ద్విచక్ర వాహనాలు రోడ్డుపై పార్కు చేయడంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి అన్నారు. ఈ విషయం పోలీసులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్