బొమ్మగానపల్లి గ్రామం వంక తాండాలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న బ్రహ్మసముద్రం ఎస్ఐ నరేంద్ర కుమార్ తన సిబ్బందితో సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఐదు మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ. 3, 720లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. ఈ దాడుల్లో మండల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడైనా మట్కా, పేకాట ఆడుతున్నట్లు మా దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.