కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి వసంతబాబు శెట్టూరు మండలం లక్ష్మంపల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేకు వెళ్ళే ముందు సంబంధిత రైతులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలన్నారు. హాజరు కాని రైతులకు కనీసం 3సార్లు వరకు అవకాశం ఇవ్వాలని, రీసర్వే పనులను పూర్తి చేయాలని అధికారులను అదేశించారు.